https://oktelugu.com/

TCS: బీటెక్ అభ్యర్థులకు టీసీఎస్ లో ఉద్యోగ ఖాళీలు.. అర్హులు ఎవరంటే?

TCS: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. బీటెక్ పాసైన ఫ్రెషర్లను భారీ సంఖ్యలో నియమించుకోవడానికి టీసీఎస్ సంస్థ సిద్ధమైంది. ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ద్వారా టీసీఎస్ ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండటం గమనార్హం. 2020, 2021 సంవత్సరాలలో బీటెక్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది రెండో దశ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం టీసీఎస్ సంస్థ సిద్ధమైంది. 2021 సంవత్సరం డిసెంబర్ 15వ తేదీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 8, 2021 11:58 am
    Follow us on

    TCS: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. బీటెక్ పాసైన ఫ్రెషర్లను భారీ సంఖ్యలో నియమించుకోవడానికి టీసీఎస్ సంస్థ సిద్ధమైంది. ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ద్వారా టీసీఎస్ ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండటం గమనార్హం. 2020, 2021 సంవత్సరాలలో బీటెక్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది రెండో దశ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం టీసీఎస్ సంస్థ సిద్ధమైంది.

    TCS

    TCS

    2021 సంవత్సరం డిసెంబర్ 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://www.tcs.com/careers/tcs-off-campus-hiring వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు 60 శాతం మార్కులు లేదా సీజీపీఏ 6 సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

    Also Read: డిగ్రీ పాసైన విద్యార్థులకు శుభవార్త.. భారీ వేతనంతో జాబ్స్?

    ఫుల్ టైమ్ కోర్సులు చేసిన వాళ్లు, కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు రెండు పరీక్షలు ఉంటాయి. బీటెక్ పాసై అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://nextstep.tcs.com/campus/#/mainhome వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు రిజిష్టర్ చేసుకోవచ్చు.

    https://www.tcs.com/careers/tcs-off-campus-hiring వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.

    Also Read: డిఫెన్స్‌ ఎస్టేట్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?