https://oktelugu.com/

KCR TRS MP Santhosh: కేసీఆర్ ను మోకాళ్లపై కూర్చుండబెట్టి పైకి ఎక్కిన ఈ పిల్లాడు కేటీఆర్ కాదు.. ఎవరో తెలుసా?

KCR TRS MP Santhosh: బాల్యంలోనే అన్ని బంధుత్వాలు.. ప్రేమలు.. అవి చిరకాలం గుర్తుంటాయి. పండుగలు, పబ్బాలు వచ్చినప్పుడు అందరూ ఒక్కటవుతారు. తమ అనుబంధాలను పంచుకుంటారు. అలాంటి సమయంలో కొన్ని అరుదైన అద్భుత ఘట్టాలు చోటుచేసుకుంటాయి. వాటికి కెమెరా రూపం ఇస్తే అంతే అందంగా కనిపిస్తాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉన్నారని.. కనీసం తన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితతో కలిసి సరదాగా కూడా గడపలేదని పలు సందర్భాల్లో వాళ్లే చెప్పుకున్నారు. రాజకీయాల్లోకి […]

Written By: , Updated On : December 8, 2021 / 08:51 AM IST
Follow us on

KCR TRS MP Santhosh: బాల్యంలోనే అన్ని బంధుత్వాలు.. ప్రేమలు.. అవి చిరకాలం గుర్తుంటాయి. పండుగలు, పబ్బాలు వచ్చినప్పుడు అందరూ ఒక్కటవుతారు. తమ అనుబంధాలను పంచుకుంటారు. అలాంటి సమయంలో కొన్ని అరుదైన అద్భుత ఘట్టాలు చోటుచేసుకుంటాయి. వాటికి కెమెరా రూపం ఇస్తే అంతే అందంగా కనిపిస్తాయి.

KCR TRS MP Santhosh

kcr santhosh1

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉన్నారని.. కనీసం తన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితతో కలిసి సరదాగా కూడా గడపలేదని పలు సందర్భాల్లో వాళ్లే చెప్పుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా మంత్రిగా కేసీఆర్ బిజీగా ఉన్నప్పుడు తన పిల్లలతో అప్యాయంగా గడపలేకపోయారని టాక్ ఉంది.

అయితే ఎప్పుడో ఒకప్పుడు కేసీఆర్ తో వారి ముచ్చట తీర్చుకొని ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ సడ్డకుడి కుమారుడైన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ ఇప్పుడు ఎప్పుడూ వెన్నంటే ఉంటున్నాడు. చిన్నప్పుడు కేసీఆర్ పై అదే ప్రేమను కనబరిచాడని ఈ ఫొటో ద్వారా తెలుస్తోంది.

తన పుట్టినరోజున ఒక అరుదైన ఫొటోను షేర్ చేసి కేసీఆర్ తో అనుబందాన్ని చాటుకున్నాడు టీఆర్ఎస్ ఎంపీ సంతోషం. తన పెద్దనాన్నతో తనకు మిగిలిన తీపిగుర్తులను పంచుకున్నారు.

Also Read: పాపులారిటీ కోసం కేసీఆర్ ఫార్ములానే జగన్ ఫాలో అవుతున్నారా?

సంతోష్ కుమార్ బర్త్ డే సందర్భంగా ఆయన ట్విట్టర్ లో ఒక ఫోటో పంచుకున్నారు. ‘కేసీఆర్ తనను చిన్నప్పుడు భుజాలపై ఎత్తుకున్న ఫొటోను షేర్ చేస్తూ ‘‘ఈ పుట్టుక నాది.. బ్రతుకంతా మీది’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీఆర్ఎస్ అభిమానులు, ఎమ్మెల్యేలు, మంత్రులతోపాటు రాజకీయ ప్రముఖులు సంతోష్ కు బర్త్ డే విషెస్ చెబుతూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Also Read: జర్నలిస్టుల విషయంలో తెలంగాణే నయం..!