Jobs : భారత ప్రభుత్వానికి చెందిన ఇన్‌కమ్‌ట్యాక్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కేరళ విభాగంలో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. అథ్లెటిక్స్ (ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్), బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, రోయింగ్ క్రీడాంశాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. పదో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
Also Read: మచిలీపట్నం బెయిల్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్ జాబ్స్.. భారీ వేతనంతో?
ఆఫ్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తులను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ది ప్రిన్సిపల్ ఛీప్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, కేరళ అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది. ఫీల్డ్ ట్రైల్, రాత పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 25,500 రూపాయల నుంచి 81,000 రూపాయల వరకు వేతనంగా లభిస్తుంది.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 18,000 రూపాయల నుంచి 56,900 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.incometaxindia.gov.in/pages/default.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: సికింద్రాబాద్ రైల్వేలో 81 జూనియర్ ఇంజినీర్ జాబ్స్.. భారీ వేతనంతో?