Currency Printing Jobs: దేశంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా గత కొన్ని నెలల నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ సంస్థ నర్మదాపురంలోనున్న సెక్యూరిటీ పేపర్ మిల్ లో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు దరఖాస్తులను కోరుతోంది. మొత్తం 6 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులతో పాటు సూపర్ వైజర్ల ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. సోషల్ సైన్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా పాసైన వాళ్లు వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
Also Read: కేసీఆర్ తో యుద్ధానికి బీజేపీ సిద్ధం..రె‘ఢీ’
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 27,600 రూపాయల నుంచి 95,910 రూపాయల వరకు వేతనంగా లభించనుంది. పీజీలో ఉత్తీర్ణత ఉన్నవాళ్లు జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. https://spmhoshangabad.spmcil.com/interface/jobopenings.aspx?menue=5 వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 2022 సంవత్సరం మార్చి 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు చివరి తేదీగా ఉంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
Also Read: హోదా రగిలింది..వైసీపీ ఏం చేస్తుంది?