https://oktelugu.com/

Jobs: సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

Jobs: సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. తెలంగాణ‌ స‌మ‌గ్ర శిక్ష స్కీమ్ కు సంబంధించిన ఈ సంస్థ మొత్తం 6 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఫైనాన్స్ అసిస్టెంట్‌, టెక్నిక‌ల్ సివిల్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలతో పాటు యంగ్ ప్రొఫెష‌న‌ల్‌, మోనిట‌రింగ్ అండ్ ఎవాల్యుయేష‌న్ ప్రొఫెష‌న‌ల్‌, మేనేజ‌ర్‌(మీడియా & డాక్యుమెంటేష‌న్‌) ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కంప్యూట‌ర్ నైపుణ్యాలు, సంబంధిత […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 15, 2022 / 10:39 AM IST
    Follow us on

    Jobs: సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. తెలంగాణ‌ స‌మ‌గ్ర శిక్ష స్కీమ్ కు సంబంధించిన ఈ సంస్థ మొత్తం 6 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఫైనాన్స్ అసిస్టెంట్‌, టెక్నిక‌ల్ సివిల్ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలతో పాటు యంగ్ ప్రొఫెష‌న‌ల్‌, మోనిట‌రింగ్ అండ్ ఎవాల్యుయేష‌న్ ప్రొఫెష‌న‌ల్‌, మేనేజ‌ర్‌(మీడియా & డాక్యుమెంటేష‌న్‌) ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

    కంప్యూట‌ర్ నైపుణ్యాలు, సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తెలుగు రాయడంతో పాటు చదవడం కచ్చితంగా వచ్చి ఉండాలి. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి.

    ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు వేతనం లభించే అవకాశం అయితే ఉంటుంది. 2022 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. https://www.cgg.gov.in/careers/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

    అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుందని తెలుస్తోంది.