https://oktelugu.com/

Hyderabad Jobs: హైదరాబాద్ లోని ప్రముఖ సంస్థలో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

Hyderabad Jobs: నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ సంస్థలో మొత్తం 20 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో ప్రాజెక్ట్ ఫీల్డ్‌ ఆపరేషన్‌ మేనేజర్‌, ప్రాజెక్ట్ టెక్నికల్‌ ఆఫీసర్, ప్రాజెక్ట్‌ ల్యాబొరేటరీ అటెండెంట్‌, ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ ఇన్వస్టిగేటర్‌, ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 24, 2021 / 09:01 AM IST
    Follow us on

    Hyderabad Jobs: నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ సంస్థలో మొత్తం 20 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో ప్రాజెక్ట్ ఫీల్డ్‌ ఆపరేషన్‌ మేనేజర్‌, ప్రాజెక్ట్ టెక్నికల్‌ ఆఫీసర్, ప్రాజెక్ట్‌ ల్యాబొరేటరీ అటెండెంట్‌, ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ ఇన్వస్టిగేటర్‌, ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ అటెండెంట్‌ జాబ్స్ ఉన్నాయి.

    Hyderabad Jobs

    పదో తరగతి, డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంబీబీఎస్‌/ ఎండీ/ ఎంఫిల్‌/ పీహెచ్‌డీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలో కూడా అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌లో ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?

    డైరెక్టర్‌, ఐసీఎంఆర్‌-నిన్‌, జామై ఉస్మానియా పోస్ట్‌, తార్నాక, హైదరాబాద్‌-500007 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపవచ్చు. అకడమిక్‌ అర్హత ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు షార్ట్ లిస్టింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు తుది ఎంపిక జరగనుందని తెలుస్తోంది. 2021 సంవత్సరం జనవరి 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.

    https://www.nin.res.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

    Also Read: టీఎంసీలో 175 ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.53,100 వేతనంతో?