Homeఎడ్యుకేషన్JEE Final Key 2023: జేఈఈలో 300/300.. వీడిది బుర్రా.. కంప్యూటరా!

JEE Final Key 2023: జేఈఈలో 300/300.. వీడిది బుర్రా.. కంప్యూటరా!

JEE Final Key 2023
Singaraju Venkat Kaundinya

JEE Final Key 2023: మనుషుల్లో ప్రతిభావంతులు, అత్యంత ప్రతిభా వందులు అనే కేటగిరీలు ఉంటాయి. పిల్లల్లోల ఈ లక్షణాలు ప్రస్పుటంగా బయటపడతాయి. పరీక్షలు, ఎక్స్‌ట్రా టాలెంట్‌తో వాటిని బయటపెడుతుంటారు. ఇటీవలే ఓ హైరాబాద్‌కు చెందిన 18 నెలల బుడతడు తన పెయింటింగ్స్‌తో రికార్డులు సృష్టించాడు. లిమ్‌కా బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు పంసాదించాడు. ఐక్యూ అధికంగా ఉన్నవారు ఇలా ఉంటారని మానసిక నిపుణులు చెబుతారు. ఇలాగే ఓ విద్యార్థి కూడా జేఈఈ మెయిన్స్‌లో అత్యంత ప్రతిభ కనబర్చి రికార్డు సృష్టించాడు. ఎవరికీ సాధ్యంకాని మార్కులను తాను సాధించి చూపించాడు.

9 లక్షల మంది హాజరు..
జేఈఈ మెయిన్స్‌ చివరి విడత పరీక్ష తుది కీని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. ఈనెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బీటెక్‌ సీట్ల కోసం పేపర్‌–1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రాథమిక కీని కొద్దిరోజుల క్రితం వెల్లడించిన ఎన్‌టీఏ దానిపై అభ్యంతరాలను స్వీకరించింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి తుది కీని వెబ్‌సైట్‌లో ఉంచింది. ప్రాథమిక కీలో ఇచ్చిన జవాబుల్లో మొత్తం 24 ప్రశ్నలకు సమాధానాలను మార్చినట్లు శ్రీచైతన్య ఐఐటీ జాతీయ డీన్‌ ఎం.ఉమాశంకర్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. గత జనవరి, తాజా పరీక్షల్లో వచ్చిన స్కోర్‌లో ఉత్తమమైన దాన్ని ఎంచుకొని ర్యాంకులు ఇస్తారు. రాత్రి 10 గంటల వరకు మాత్రం వాటిని ప్రకటించలేదు.

JEE Final Key 2023
JEE Final Key 2023

హైదరబాద్‌ స్టూడెంట్‌ అదుర్స్‌..
హైదరాబాద్‌కు చెందిన సింగరాజు వెంకట్‌ కౌండిన్య 300కి 300 మార్కులు సాధించాడు. ఆయన మొదటి 10 ర్యాంకుల్లో నిలిచే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కౌండిన్య పాఠశాల విద్య నుంచి ఇంటర్‌ వరకు హైదరాబాద్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థల్లో చదివాడు. జూన్‌ 4వ తేదీన జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతానని కౌండిన్య తెలిపాడు.

30 నుంచి అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్‌..
జేఈఈ మెయిన్స్‌లో కనీస కటాఫ్‌ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత కల్పిస్తారు. వారు ఈనెల 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు మే 7వ తేదీ తుది గడువు. జూన్‌ 4వ తేదీన జరిగే పరీక్ష ఫలితాలను జూన్‌ 18వ తేదీన వెల్లడిస్తారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version