Jobs: ఇంజనీరింగ్ విద్యార్థులకు ఐటీ స్పెషలిస్ట్ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

Jobs: స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 15 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. బీటెక్ పాసైన విద్యార్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఇంజనీరింగ్ తో పాటు బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంసీఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. డెవొప్స్, […]

Written By: Kusuma Aggunna, Updated On : January 14, 2022 9:50 am
Follow us on

Jobs: స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 15 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. బీటెక్ పాసైన విద్యార్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఇంజనీరింగ్ తో పాటు బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంసీఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలి.

డెవొప్స్, మేనేజ్‌మెంట్ విభాగాలతో పాటు ఫుల్‌స్టాక్, జే2 ఈఈ బ్యాక్‌ఎండ్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈమెయిల్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. recruitment@sidbi.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

2022 సంవత్సరం జనవరి 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. https://www.sidbi.in/en వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మొత్తం 15 ఉద్యోగ ఖాళీలలో జే2 ఈఈ సీనియర్‌ డెవలపర్‌ ఉద్యోగ ఖాళీలతో పాటు టెక్నికల్‌ లీడ్‌, జే2 ఈఈ టెక్నికల్‌ లీడ్‌, డెవొప్స్‌ లీడ్‌, టెక్నికల్‌ ఆర్కిటెక్ట్‌, టెక్నికల్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఉద్యో గఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.