ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా అక్టోబర్ 10 ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://apprenticeshipindia.org/apprenticeship/opportunity-view/6130aa62f6f9d72f612ced84 వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
మెరిట్ లిస్ట్, రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించకుండానే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 7,000 రూపాయల నుంచి 9,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. అప్రెంటీస్ కాల పరిమితి కేవలం 12 నెలలు మాత్రమే ఉండటం గమనార్హం.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఉద్యోగులకు ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుసగా రిలీజవుతున్న జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.