Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.40,000 వేతనం లభిస్తుంది.
2022 సంవత్సరం జూన్ నెల 30వ తేదీ నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. సీఏ/సీఎంఏలో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. సంబంధిత పనిలో మూడు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. ఇండియన్ ఆయిల్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించకుండానే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు భారీస్థాయిలో మేలు జరుగుతుండటం గమనార్హం.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Iocl recruitment 2022 for assistant officers posts in finance
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com