Homeఎడ్యుకేషన్Kunal R Virulkar: ఇది 12 ప్రయత్నాల సివిల్ ఫెయిల్యూర్ స్టోరీ.. చివరకు మోడీ కూడా...

Kunal R Virulkar: ఇది 12 ప్రయత్నాల సివిల్ ఫెయిల్యూర్ స్టోరీ.. చివరకు మోడీ కూడా స్పందించక తప్పలేదు..

Kunal R Virulkar: హనుమాన్ జంక్షన్ సినిమా చూశారా..”గెలిచినవాడు చెప్పాలి.. ఓడినవాడు వినాలి” అని పరుచూరి గోపాలకృష్ణ ఓ డైలాగ్ అంటాడు గుర్తుందా.. మన సమాజం, చివరికి మీడియా గెలిచిన వాడి మాటలే వింటుంది. వాడి గురించే అహో, ఓహో అంటూ చెబుతుంది. మరి ఓడిన వాడి గురించి.. వాడు చేసిన ప్రయత్నం గురించి.. సమాజం పట్టించుకోదు.. మీడియా చెవికెక్కించుకోదు.. అలాంటప్పుడు ఓడిన వాడి గురించి.. వాడు చేసిన ప్రయత్నం గురించి.. ఎలా తెలుసుకోవాలి.. వాస్తవానికి విజేతల కంటే విఫలమైన వారి గురించే కదా సమాజానికి తెలియాల్సింది.. ఎక్కడ పొరపాట్లు జరిగాయో తెలిస్తేనే కదా లక్షల మందికి ఉపయుక్తం.

అతని పేరు కునాల్ ఆర్ విరుల్కర్.. ఇంజనీరింగ్ పట్టభద్రుడు. తన పేరు మాత్రమే చెప్పిన అతడు.. ఊరు, తన విఫల ప్రయత్నాలు, తన కథ, తన గాధ, తన ప్రయత్నాలు ఏవీ చెప్పలేదు..12సార్లు సివిల్స్ రాసాడు.. ఏడుసార్లు మెయిన్స్ రాశాడు. ఐదుసార్లు ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. మనిషి జీవితం అంటేనే సంఘర్షణకు ప్రతిరూపం. ప్రతి దాన్ని కొట్లాడి కదా(అందరూ కాదు) సాధించుకునేది. తన గురించి కునాల్ ఒక్క ట్వీట్ చేయగానే.. చాలామంది స్పందించారు. ఎంతలా అంటే అతడు చేసిన ట్వీట్ నిన్న ట్విట్టర్ ఎక్స్ లో ట్రెండింగ్ లో ఉంది.

ఈ కథనం రాసే సమయం వరకు 18 లక్షల వ్యూస్ నమోదయ్యాయి. 2,686 రీ – పోస్టులు కొట్టారు.. 24,600 మంది లైక్ చేశారు. 1,335 బుక్ మార్క్స్ నమోదయ్యాయి. “మీ పోరాటం బాగుంది. ఏది రాసిపెట్టి ఉందో అది దక్కుతుంది. శుభాకాంక్షలు” అని అంటాడు ఓ నెటిజన్. “ప్రయత్నించు. ఇంకా ప్రయత్నించు. ఈసారి కాకపోయినా మరోసారైనా విజయం సాధిస్తావ్” అని యువతి ధైర్యవచనాలు. ” మీ ప్రయత్నం చాలామందికి దారి చూపుతుంది. మీరు ఇలానే సాగిపోండి.. విజయం వైపు అడుగులు వేయండి” అంటాడు ఓ సీనియర్ సిటిజన్. “మీరు పట్టువదలని విక్రమార్కుడి టైపు. ఏదైనా సాధించగలరు. త్వరలోనే మీరు అనుకున్న లక్ష్యంలో స్థిరపడతారు”అంటూ ఇంకో వ్యక్తి కామెంట్..” మనిషి జీవితమే ఒక పోరాటం. ఇలాంటి పోరాటాలు చేస్తున్నారంటే మీకు ఏదో బలమైనది తగులుతుంది” ఓ స్టూడెంట్ ఉవాచ.. “అన్ని వైఫల్యాలు మీరు ఎలా తట్టుకున్నారు. వాటిని తట్టుకొని ఎలా ప్రయత్నిస్తున్నారు” ఓ యువకుడి ఆశ్చర్యం. “నువ్వు ఒక స్ఫూర్తి. అసలు ఆగకు.. ఓడిపోయానని కుంగిపోకు.. విజయం నిన్ను వరిస్తుంది” జర్నలిస్టు అభిజిత్ కరాండే సూక్తి ముక్తావళి. ఇక స్వాతి చతుర్వేది అనే జర్నలిస్ట్ అయితే..”ఇది కదా సానుకూల దృక్పథానికి ఉదాహరణ. ఇది పక్కా యోగి తత్వం” అంటూ వ్యాఖ్యానించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కామెంట్లు.. మరెన్నో ధైర్య వచనాలు.. స్థూలంగా ఇక్కడే ఒక మాట గుర్తుకొస్తుంది.. “గెలిస్తే మహా అయితే ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది. అదే ఓడిపోతే ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది”.. కునాల్ 12సార్లు సివిల్స్ రాయవచ్చు గాక.. ఏడుసార్లు మెయిన్స్ కు ఎంపిక వచ్చుగాక. ఐదుసార్లు ఇంటర్వ్యూలకు హాజరై సెలెక్ట్ కాకపోవచ్చు గాక.. కానీ ఎక్కడో ఒక మూల.. ఏదో ఒకచోట పాజిటివిటీ. దాన్ని తెలుగులో ఆత్మవిశ్వాసం అంటారు. ఆ ఆత్మవిశ్వాసంతో కునాల్ ఏదో ఒక రోజు ఐఏఎస్ అవుతాడు. అయ్యి తీరుతాడు. ఎందుకంటే విజయం కష్టానికి లొంగాల్సిందే.

ఇక చివరగా నిన్న సివిల్స్ ఫలితాలు విడుదలైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ లో.. “ఓటములు ఇబ్బందిగానే అనిపిస్తాయి. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోండి.. ఈ ముగింపు మీ ప్రయాణాన్ని ఆపివేయకూడదు. పరీక్షల్లో నెగ్గే అవకాశాలు చాలా ఉంటాయి. వాటికి మించి ఈ దేశం మీకు ఎన్నో అవకాశాలకు వేదిక. మీ ప్రతిభను ప్రకాశింపజేసుకునే.. మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకునే ఎన్నో అవకాశాల కోసం వెతకండి. అన్వేషించండి. కష్టపడండి.” అంటూ వ్యాఖ్యానించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular