Inter-SSC Results: ఏపీలో పదో తరగతి పరీక్షలు( 10th class exams ) పూర్తయ్యాయి. కొన్ని రోజుల కిందటే ఇంటర్ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఇంటర్ విద్యలో తెచ్చిన మార్పులతో తొలి ఏడాది ఇంటర్ క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు క్లాసులు కొనసాగించి అనంతరం వేసవి సెలవులు ఇవ్వనున్నారు. అయితే ఇంతలో పదో తరగతితో పాటు ఇంటర్ ఫలితాలు ప్రకటించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాల సన్నాహాలు చేస్తోంది. వీలైనంత త్వరగా ఫలితాలు ఇవ్వాలని భావిస్తోంది. ప్రస్తుతం మూల్యాంకనం కూడా పూర్తయింది. అయితే ఇంటర్ కు సంబంధించి మూల్యాంకనం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : 75% హాజరు తప్పనిసరి, కఠిన నిబంధనలతో విద్యార్థులకు సవాల్
* విద్యార్థుల అవసరాల రీత్యా
ఫలితాలు వచ్చిన తరువాతే తదుపరి విద్యకు సంబంధించి కార్యాచరణ మొదలుపెట్టనున్నారు విద్యార్థులు. సాధారణంగా పదో తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత ఇంటర్లో మంచి కాలేజీలో చేరేందుకు సిద్ధపడతారు. మరోవైపు ఇంటర్ పరీక్షలు( inter exams ) రాసిన విద్యార్థులు ఎంసెట్ తో పాటు నీట్ కోసం ప్రిపేర్ అవుతుంటారు. అటువంటి వారంతా ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. ఏపీలో ఈ నెల 3 నుంచి 10వ తరగతి మూల్యాంకనం ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఏడు రోజుల్లోనే మూల్యాంకనం పూర్తి చేసేందుకు ఏపీ విద్యాశాఖ ఏర్పాటు చేసింది. అనుకున్నట్టు జరిగితే ఈ నెల చివరి వారంలోనే పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.
* వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా
మరోవైపు ఏపీలో ఫలితాలు వెల్లడికి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్( WhatsApp governance ) విధానాన్ని వినియోగించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఈ విధానం ద్వారా హాల్ టికెట్ల జారీ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పుడు ఫలితాలు సైతం ఇదే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. విద్యార్థులు వాట్సాప్ నెంబర్ 9552300009 లేదా అధికారిక వెబ్ సైట్ http://www.bse.ap.gov.in/ ద్వారా అందుబాటులోకి తేనున్నారు. మరోవైపు ఎంటర్ ఫలితాలు సైతం గతం కంటే వేగంగా విడుదల కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షల మూల్యాంకనం వేగంగా కొనసాగుతోంది. ఈనెల 6నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత ఫలితాలు కంప్యూటరీకరణ చేసేందుకు ఐదు నుంచి ఆరు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సంవత్సరం హాల్ టికెట్లు వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. గత కొన్ని రోజులుగా వాట్సాప్ గవర్నెన్స్ పై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దీనిపై కసరత్తు చేసింది. ఇప్పటికే ఈ విధానం ద్వారా వందలాది సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి మరో 500 సేవలు అందుబాటులోకి తేవాలని చూస్తోంది.
Also Read : ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. కీలక ప్రకటన చేసిన సీఎం