https://oktelugu.com/

నిరుద్యోగులకు ఇన్ఫోసిస్ శుభవార్త.. 19,203 ఉద్యోగాలు..?

ప్రముఖ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని మన దేశంలో 19,203 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకోవడం ద్వారా సిబ్బందిని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. భారత్ వెలుపల 1,941 మందిని నియమించుకోనున్నామని తెలిపారు. 2,022 సంవత్సరం నాటికి అమెరికాలో 25,000 మందిని నియమించుకుంటామని నందన్ నీలేకని వెల్లడించారు. బ్రిటన్ లో 1,000 డిజిటల్ ఉద్యోగాలను సృష్టించాలని అనుకుంటున్నామని 2,023 నాటికి కెనడాలో సిబ్బందినిరెండింతలు చేసి 4,000కు చేరుస్తామని నందన్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 20, 2021 / 09:26 AM IST
    Follow us on

    ప్రముఖ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని మన దేశంలో 19,203 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకోవడం ద్వారా సిబ్బందిని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. భారత్ వెలుపల 1,941 మందిని నియమించుకోనున్నామని తెలిపారు. 2,022 సంవత్సరం నాటికి అమెరికాలో 25,000 మందిని నియమించుకుంటామని నందన్ నీలేకని వెల్లడించారు.

    బ్రిటన్ లో 1,000 డిజిటల్ ఉద్యోగాలను సృష్టించాలని అనుకుంటున్నామని 2,023 నాటికి కెనడాలో సిబ్బందినిరెండింతలు చేసి 4,000కు చేరుస్తామని నందన్ నీలేకని అన్నారు. మరోవైపు ఇన్ఫోసిస్ 2021 జులై నెల నుంచి అమలులోకి వచ్చే విధంగా వేతన పెంపును ప్రకటించడం గమనార్హం. నైపుణ్యాలు ఉన్న సిబ్బందిని కాపాడుకోవడం కొరకు, వలసల రేటును తగ్గించడం కొరకు ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

    మరోవైపు ఆదాయపు పన్ను ఇ ఫైలింగ్ కొత్త పోర్టల్ లో తలెత్తిన సాంకేతిక సమస్యలకు ఇన్ఫోసిస్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సీఓఓ ప్రవీణ్ రావు పన్ను చెల్లింపుదారులకు మరింత సౌలభ్యం ఉండటం కోసం తీసుకొచ్చిన పోర్టల్ లో తలెత్తిన సమస్యలను పరిష్కరించామని తెలిపారు. రాబోయే కొద్ది వారాలలో మిగిలిన సమస్యలకు కూడా పరిష్కారం చూపుతామని ఇప్పటివరకు లక్ష రిటర్నులు ఫైల్ అయ్యాయని ప్రవీణ్ రావు అన్నారు.

    ఇన్ఫోసిస్ 2020 – 2021 సంవత్సరానికి అమెరికాలో హెచ్1బీ వీసాలకు సంబంధించిన దరఖాస్తుల కొరకు అనుమతులు ఇచ్చే రేటు పెరిగినట్టు తెలిపారు. అమెరికాలో 65 శాతం స్థానిక ఉద్యోగులనే నియమించుకుంటామని ఇన్ఫోసిస్ పేర్కొంది. హెచ్1బీ వీసాలు పొందిన వాళ్లలో ఎక్కువమంది అమెరికాకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఇన్ఫోసిస్ వెల్లడించింది.