‘ది ప్యామిలీమెన్ 2’ వెబ్ సిరీస్ ఇండియాలో ఏ వెబ్ సిరీస్ హిట్ అవ్వని స్థాయిలో సూపర్ హిట్ అయింది. దాంతో సహజంగానే ఈ వెబ్ సిరీస్ పై యావత్తు భారతీయ సినీ లోకం ఆసక్తిని పెంచుకుంది. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ మూడో పార్ట్ కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చిన మేకర్స్, ప్రస్తుతం స్క్రిప్ట్ పై కూర్చున్నారు. అయితే, మూడో పార్ట్ లో ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రాసినట్లు తెలుస్తోంది.
ఆ క్యారెక్టర్ లో విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని తీసుకోబోతున్నారు. మరి విజయ్ ఒప్పుకుంటాడా ? అసలు ఈ వెబ్ సిరీస్ పై తమిళనాడులో నిరసనల సెగలు పెద్ద ఎత్తున రగిలాయి. ఈ వెబ్ సిరీస్ పై తమిళనాట అరవ ప్రేక్షకులతో పాటు అరవ సినిమా ప్రముఖులు కూడా విమర్శలు చేశారు. పైగా తమిళనాడులో ఈ వెబ్ సిరీస్ ను నిషేధించాలని ధర్నాలు కూడా చేసారు.
అలాగే అక్కడి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ సిరీస్ ను నిషేధించాలని విజ్ఞప్తి చేశాయి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ వెబ్ సిరీస్ పై ఇంతగా రియాక్ట్ అయ్యాక, విజయ్ సేతుపతి ఈ సిరిస్ మూడో పార్ట్ లో నటించడానికి ఒప్పుకోకపోవచ్చు అని అంటున్నారు విజయ్ సేతుపతి సన్నిహితులు.
నిన్నటి నుండి విజయ్ సేతుపతి ఈ సిరీస్ లో నటిస్తున్నాడనే వార్త బయటకు రాగానే.. సీనియర్ దర్శకుడు భారతీరాజా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనదైన శైలిలో విజయ్ సేతుపతికి ఫోన్ చేసి మరి ఈ సిరీస్ కి దయచేసి దూరం ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద యావత్తు తమిళ జాతి తమకు వ్యతిరేకంగా ‘ది ఫ్యామిలీ మెన్ 2’ సిరీస్ రూపొంది అని, అందుకే ఈ సిరీస్ మేకర్స్ ను తమిళ సమాజం శత్రువులుగా చూస్తోంది.