బీటెక్ పాసైన వాళ్లకు శుభవార్త.. నేవీలో పరీక్ష లేకుండా జాబ్స్..?

ఇండియన్‌ నేవీలో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఐటీ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజైంది. 45 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జులై 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ […]

Written By: Kusuma Aggunna, Updated On : July 12, 2021 3:15 pm
Follow us on

ఇండియన్‌ నేవీలో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఐటీ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజైంది. 45 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జులై 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచీ ఎస్‌ఎస్‌సీ -ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పోస్టుల భర్తీ జరగనుంది. 2022 సంవత్సరం జనవరి నెల నుంచి ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రారంభం కానుంది. అవివాహిత పురుష అభ్యర్థులై ఉండటంతో పాటు 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఎం.ఈ, ఎంటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 1997, జనవరి 2 నుంచి 2002, జూలై 1 ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కరోనా వైరస్ విజృంభణ వల్ల నేవీ ఎంట్రన్స్ టెస్ట్ జరగడం లేదు. అకడమిక్‌ మెరిట్‌ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆగష్టు నెల 21వ తేదీ తర్వాత బెంగళూరు, భోపాల్‌, విశాఖపట్నం, కోల్‌కతాలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వారికి వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. మొదట ఈ ఉద్యోగాలకు 10 ఏళ్ల కాలపరిమితితో తీసుకుని ఆ తర్వాత నాలుగేళ్లు పొడించే అవకాశం ఉంటుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి కేరళ ఎజిమళలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నాలుగు నెలల ఎస్‌ఎస్‌సీ ఐటీ శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రొఫెషనల్‌ ట్రెయినింగ్‌ ను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడం జరుగుతుంది.