https://oktelugu.com/

Jobs: ఇంటర్ పాసైన వాళ్లకు 2500 ఉద్యోగ ఖాళీలు.. రూ.69,000 వేతనంతో?

Jobs: ఇండియన్ నేవీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అవివాహిత పురుష అభ్యర్థుల కొరకు జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. సీనియర్ సెకండరీ రిక్రూట్స్, ఆర్టిఫిషర్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను ఈ సంస్థ భర్తీ చేయనుందని తెలుస్తోంది. ఇంటర్ ఎంపీసీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 2500 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఏ) 500 ఉద్యోగ ఖాళీలను, సీనియర్ సెకండరీ రిక్రూట్స్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 18, 2022 / 09:01 AM IST
    Follow us on

    Jobs: ఇండియన్ నేవీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అవివాహిత పురుష అభ్యర్థుల కొరకు జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. సీనియర్ సెకండరీ రిక్రూట్స్, ఆర్టిఫిషర్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను ఈ సంస్థ భర్తీ చేయనుందని తెలుస్తోంది. ఇంటర్ ఎంపీసీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 2500 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది.

    ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఏ) 500 ఉద్యోగ ఖాళీలను, సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్‌ఎస్ఆర్‌) 2000 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ) ఉద్యోగ ఖాళీలకు 60 శాతం మార్కులతో ఇంటర్ పాసైన వాళ్లు అర్హులు అని చెప్పవచ్చు. 2002 ఆగస్టు 1 నుంచి 2005 జులై 31 మధ్య జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు.

    సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌) ఉద్యోగ ఖాళీలు 2000 ఉండగా కనీసం 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు 10,000 మందిని ఫిజికల్ టెస్టులకు ఆహ్వానిస్తారు.

    ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు ఆగస్టు 2022లో ప్రారంభమయ్యే శిక్షణకు ఆ శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది. ట్రైనింగ్ లో 14,600 రూపాయలు స్టైఫండ్ పొందే ఛాన్స్ ఉండగా శిక్షణ తర్వాత నెలకు రూ.21,700 నుంచి రూ. 69,100 వరకు పొందే అవకాశం ఉంటుంది.