Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీ ఇంటర్ పాసైన విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ జారీ అయింది. పెళ్లి కాని యువకులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికవుతారో వాళ్లు కేరళలోని ఎజిమలలో పని చేయాల్సి ఉంటుంది.

మొత్తం 35 ఖాళీలు ఉండగా 2022 సంవత్సరం జనవరి నెలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన బీటెక్ డిగ్రీ కోర్సు మొదలు కానుంది. ఎడ్యుకేషన్, ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్ లలో ఈ ఖాళీల భర్తీ జరగనుండగా 2021 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీన ఈ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీలోపు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 35 ఖాళీలలో ఎడ్యుకేషన్ బ్రాంచ్ ఉద్యోగ ఖాళీలు 5, ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్ ఉద్యోగ ఖాళీలు 30 ఉన్నాయి. కనీసం 70 శాతం మార్కులతో పాసై జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసిన వాళ్లు ఈ నోటిఫికేషన్ ద్వారా బీటెక్ చదవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
విశాఖపట్నం, బెంగళూరు, భోపాల్, కోల్‌కతా ప్రాంతాలలో నోటిఫికేషన్ లో పేర్కొన్న ఖాళీలకు సంబంధించిన ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇంటర్వ్యూ తేదీలకు సంబంధించిన వివరాలను ప్రకటించాల్సి ఉంది. https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను భవిష్యత్తు అవసరాల కొరకు దాచుకోవాలి.