India Post Recruitment 2021: భారత ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ఇండియన్ పోస్టల్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 221 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఢిల్లీ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్పోర్ట్స్ కోటా ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్ట్ మ్యాన్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తారు. ఇంటర్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు వేతనంగా లభించనుంది. పోస్ట్ మ్యాన్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 21,700 రూపాయల నుంచి 59,100 రూపాయల వరకు వేతనంగా లభిస్తుంది.
మల్టీ టాస్కింగ్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు పదో తరగతి పాసై ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 18,000 రూపాయల నుంచి 56,900 రూపాయల వరకు వేతనంగా లభిస్తుంది. ఆఫ్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏడీ (రిక్రూట్‌మెంట్), సీపీఎంజీ, ఢిల్లీ సర్కిల్, మేఘదూత్ భవన్, న్యూఢిలీ – 110001 అడ్రస్ కు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.
రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల 4వ తేదీ నుంచి ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా అక్టోబర్ 12వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.