Indian Coast Guard Recruitment 2023: ఇండియన్ కోస్ట్ గార్డ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 65 ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల కాగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
జనరల్ డ్యూటీ ఉద్యోగ ఖాళీలకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్, డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 1998 సంవత్సరం నుంచి 2002 సంవత్సరం మధ్య పుట్టినవారు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. కమర్షియల్ పైలట్ ఎంట్రీ ఉద్యోగ ఖాళీలకు పురుషులతో పాటు స్త్రీలతో దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: కన్ఫ్యూజ్ చేస్తున్న గంటా.. చంద్రబాబు రమ్మన్నా రావట్లే.. వేరే ప్లాన్ ఉందా..?
కమర్షియల్ పైలట్ లైసెన్స్ తో పాటు కనీసం 55 శాతం మార్కులతో పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. టెక్నికల్ ఉద్యోగ ఖాళీలకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా 60 శాతం మార్కులతో బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. రాతపరీక్షలో సాధించిన మార్కుల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
2022 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. https://joinindiancoastguard.cdac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
Also Read: మేడారం జాతరలో అపశృతి.. తొక్కిసలాటలో ఇద్దరు భక్తుల మృతి..!