AP Theatre Occupancy: ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారంపై సీఎం జగన్‌తో సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్ సమావేశమైన సంగతి తెలిసిందే. మరి అగ్ర కథానాయకులు ముఖ్యమంత్రితో భేటీ అయి.. సినిమా టికెట్ల ధరలు, చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం సాయం, ఇతర అంశాలు గురించి సుధీర్ఘంగా మాట్లాడారు. సీఎం జగన్.. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హీరోలకు అభయం కూడా ఇచ్చాడు. కాగా ఆ అభయాన్ని జగన్ నెరవేర్చే పనిలో ఉన్నాడు.
తాజాగా సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీపై రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ఇవాళ్టి నుంచే 100 శాతం ఆక్యుపెన్సీ అమలుచేసుకోవచ్చని తెలిపింది. మాస్క్ తప్పనిసరి అని పేర్కొంది. మరోవైపు సినిమా టికెట్ల పెంపు ఉంటుందని.. ఇండస్ట్రీ, ప్రజలను సంతృప్తి పరిచేలా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులు తెలిపారు.
Also Read: కరోనా తగ్గినా ఆ ఆరోగ్య సమస్య వేధిస్తోందా.. చెక్ పెట్టే చిట్కాలివే?
మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల వ్యవహారంపై సీఎం జగన్‌తో సినీ ప్రముఖులు జరిపిన చర్చ మంచి ఫలితాలను ఇచ్చేలా ఉంది. అన్నట్టు జగన్ చిన్న సినిమాలకు మేలు చేసేలా కూడా చర్యలు తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ తరహాలో విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని జగన్ భావిస్తున్నాడు.
అలాగే జగన్ సినిమా టికెట్ల ధరలను కూడా పెంచనున్నాడు. అలాగే ఎంపిక చేసిన సినిమాలకు సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇక జీఎస్టీ మినహాయింపు ఇస్తారట. ఆన్‌లైన్ టికెట్ అమలు ఫిల్మ్ ఛాంబర్‌కు అప్పగించడం పై కూడా పాజిటివ్ గా ఉన్నారట. మొత్తానికి చిరంజీవి కష్టం ఫలించింది.\
Also Read: 100 కంపెనీలు.. 50వేల మందికి ఉపాధి.. కేసీఆర్ సెంటిమెంట్ తో కొట్టిన కేటీఆర్