
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ 02/2022 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఉద్యోగ ఖాళీలు 350 ఉండగా నావిక్ (జనరల్ డ్యూటీ) 260, నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) 50, యాంత్రిక్ (మెకానికల్) 20, యాంత్రిక్ (ఎలక్ట్రికల్) 13, యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్) 7 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. నావిక్ జనరల్ డ్యూటీ ఉద్యోగ ఖాళీలకు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవాలి. 01 ఫిబ్రవరి 2000 – 31 జనవరి 2004 మధ్య జన్మించి 18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) ఉద్యోగ ఖాళీలకు పదో తరగతి గుర్తింపు పొందిన ఎడ్యునేషనల్ బోర్డుల నుంచి చదివిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 22 ఏళ్ల వయస్సు ఉండటంతో పాటు 01 ఏప్రిల్ 2000 – 31 మార్చి 2004 మధ్య జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. యాంత్రిక్ పోస్టులకు గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుండి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
1 ఫిబ్రవరి 2000 – 31 జనవరి 2004 మధ్య జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.