IAF Recruitment 2021 for 282 Civilian Posts: టెన్త్‌, ఇంటర్‌ పాసైన వాళ్లకు శుభవార్త.. ఎయిర్ ఫోర్స్ లో 282 ఉద్యోగాలు!

IAF Recruitment 2021 for 282 Civilian Posts: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 282 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కుక్, మెస్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్‌ 7వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి […]

Written By: Kusuma Aggunna, Updated On : August 21, 2021 8:52 pm
Follow us on

IAF Recruitment 2021 for 282 Civilian Posts: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 282 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కుక్, మెస్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్‌ 7వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

https://indianairforce.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో కూడా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఉద్యోగాలు ఉండటం గమనార్హం. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవసరమైన సర్టిఫికెట్లను జత చేసి ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరేలా పోస్టులో పంపించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభిస్తుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరడంతో పాటు నిరుద్యోగులు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.