https://oktelugu.com/

BHEL Recruitment 2021: బీహెచ్‌ఈఎల్‌ లో ఉద్యోగ ఖాళీలు.. రూ.2 లక్షల వేతనంతో..?

BHEL Recruitment 2021: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. 27 సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వేర్వేరు యూనిట్లలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 7వ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. https://careers.bhel.in/ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 21, 2021 / 09:05 PM IST
    Follow us on

    BHEL Recruitment 2021: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. 27 సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వేర్వేరు యూనిట్లలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 7వ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    https://careers.bhel.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. పీడియాట్రిక్స్‌, పాథాలజీ, ఆర్థోపెడిక్స్‌, గైనకాలజీ, ఇతర విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఎంబీబీస్ తో పాటు సంబంధిత స్పెషలైజేషన్ లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఏడాది అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉంటాయి.

    2021 సంవత్సరం ఆగష్టు 1వ తేదీ నాటికి 37 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 70,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

    ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్లను వెబ్ సైట్ ద్వారా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్య్వూ ద్వారా ఈ ఉద్యోగాలకు తుది ఎంపిక చేస్తారు.