IIT Tirupati: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 6 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6 ఉద్యోగ ఖాళీలలో ప్రాజెక్ట్ ఆఫీసర్ల ఉద్యోగ ఖాళీలు 3 ఉండగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ల ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి. వెబ్ డెవలప్ మెంట్, నెట్‌వర్క్స్ విభాగాలలో ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, ఎం.ఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత పనిలో అనుభవం ఖచ్చితంగా ఉండాలి. సిస్టమ్స్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి.
Also Read: కేంద్రంపై జగన్ వైఖరి మార్చుకోవాల్సిందే.. ఆ విషయాలపై ప్రశ్నించకుంటే కష్టమే..!
డిగ్రీ, బీఎస్సీ (సీఎస్)/బీసీఏ కనీసం 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.
రాత పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.iittp.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ ఉండగా 2022 సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.
Also Read: తెలంగాణలో పని మొదలుపెట్టిన పీకే టీం?