https://oktelugu.com/

Health Tips: స్నానానికి ముందు నాభికి ఇది రాశారో.. ఎన్నో లాభాలు?

పసుపు, నలుగు వంటి వాటిని రాసి వదిలేస్తే.. నూనె లేదా నెయ్యిని మాత్రం నాభిలో వేస్తారు. అసలు స్నానానికి ముందు నాభిలో వీటిని వేయడం వల్ల ఆరోగ్యానికి ఏవైనా బెనిఫిట్స్ ఉన్నాయా? దీనివల్ల కలిగే లాభాలు ఏంటో మరి పూర్తిగా తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 29, 2024 9:08 pm
    Nabhi

    Nabhi

    Follow us on

    Health Tips: రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే స్నానం తప్పనిసరి. స్నానం చేయడం వల్ల చాలా హాయిగా తగులుతుంది. ఎలాంటి నీరసం, అలసట, చిరాకు ఉన్న కూడా తొలగిపోతాయి. అయితే పూర్వకాలంలో స్నానం చేసేటప్పుడు నలుగు రాసుకుని చేసేవారు. అసలు సబ్బు వాడకుండా కేవలం నలుగు మాత్రమే వాడేవారు. దీన్ని వాడటం వల్ల చర్మంపై ఉండే మురికి అంతా పోతుంది. అయితే కొందరు స్నానం చేసేటప్పుడు చర్మానికి నూనె రాసుకుంటారు. దీనివల్ల చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని భావించడంతో పాటు కాంతివంతంగా కూడా మారుతుంది. సాధారణంగా కొందరు చర్మానికి ఏదైనా పసుపు, ఆయిల్ అప్లై చేస్తే ముందుగా నాభికి రాస్తారు. పసుపు, నలుగు వంటి వాటిని రాసి వదిలేస్తే.. నూనె లేదా నెయ్యిని మాత్రం నాభిలో వేస్తారు. అసలు స్నానానికి ముందు నాభిలో వీటిని వేయడం వల్ల ఆరోగ్యానికి ఏవైనా బెనిఫిట్స్ ఉన్నాయా? దీనివల్ల కలిగే లాభాలు ఏంటో మరి పూర్తిగా తెలుసుకుందాం.

     

    స్నానం చేసే ముందు నాభికి నెయ్యి రాయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. పొడి బారే సమస్యను తగ్గించి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అలాగే జీర్ణ క్రియ కూడా సక్రమంగా పనిచేస్తుంది. ఎందుకంటే నాభి జీర్ణ క్రియకు సరిగ్గా ఉంటుంది. ఇలా నాభికి నెయ్యి అప్లై చేయడం వల్ల జీర్ణ సమస్యలు అన్ని కూడా పూర్తిగా తొలగిపోతాయి. చాలా మంది మలబద్ధకంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఒక రెండు చుక్కల నెయ్యిని నాభిలో వేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేసి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. నెయ్యిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి నూనె కాకుండా నెయ్యినే నాభిలో వేయాలి. దీనివల్ల నాభిలో ఉండే మురికి, బ్యాక్టీరియా కూడా బయటకు వస్తాయి. కాబట్టి స్నానం చేసే ముందు నాభిలో ఇలా వేసి మసాజ్ చేస్తే చర్మ ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

     

    కొందరు కీళ్ల నొప్పులతో చాలా బాధపడుతుంటారు. అలాంటి వారు నెయ్యిని నాభిలో వేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అయితే నెయ్యిని నాభిలో వేశాక కాస్తా మసాజ్ చేయాలి. అప్పుడే కీళ్ల నొప్పులు, వాపు తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది. నాభి చుట్టూ నెయ్యిని రాసి మసాజ్ చేస్తే చర్మం అందంగా తయారవుతుందట. అలాగే కడుపు సంబంధిత సమస్యలు, పొత్తి కడుపులో నొప్పి, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యల నుంచి కూడా విముక్తి చెందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది స్నానం చేసిన తర్వాత కాకుండా ముందే చేయాలి. అప్పుడే దీని ఫలితం ఉంటుంది. లేకపోతే మీరు నెయ్యిని నాభిలో వేసుకున్న వ్యర్థమే. నెయ్యిని నాభిలో వేయడమే కాకుండా సేవించిన కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.