IIT Goa Recruitment 2021: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గోవా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 17 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 17 ఉద్యోగ ఖాళీలలో డిప్యూటీ రిజిస్ట్రార్–02, అసిస్టెంట్ రిజిస్ట్రార్–03, స్పోర్ట్స్ ఆఫీసర్–01, సీనియర్ సూపరింటెండెంట్–03 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు జూనియర్ అసిస్టెంట్–03, అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్–01, జూనియర్ సూపరిండెంట్ 2, జూనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సూపరింటెండెంట్ 2 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్ నైపుణ్యాలు, సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
27 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు నెలకు రూ.21,700 నుంచి రూ.78,800 వరకు వేతనం చెల్లిస్తారు.
సెప్టెంబర్ 26వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://iitgoa.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
