పోలీసులు వర్సెస్ బీజేపీ నేతలు.. ఏం జరుగుతోంది?

తెలంగాణలో రెండు ఎన్నికల్లో గెలుపుతో మంచి ఊపు మీద ఉంది బీజేపీ. అయితే.. అదే తీరుగా పోలీసులు, బీజేపీ నేతల మధ్య కూడా కోల్డ్‌వార్‌‌ నడుస్తోంది. ఏకంగా పోలీసులను టార్గెట్‌ చేస్తూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మొన్నటి దుబ్బాక ఉప ఎన్నిక నుంచి రాష్ట్రంలో ఈ వాతావరణం నడుస్తోంది. దుబ్బాకలో పోలీసులు క్రియేట్‌ చేసిన సీన్‌తో బీజేపీ నేతల్లో ఫైర్‌‌ మొదలైంది. Also Read: కెసిఆర్ చర్యలు పారదర్శకంగా ఎందుకులేవు? దానిని ఎమ్మెల్యే రాజాసింగ్ దాన్ని […]

Written By: Srinivas, Updated On : December 24, 2020 10:02 am
Follow us on


తెలంగాణలో రెండు ఎన్నికల్లో గెలుపుతో మంచి ఊపు మీద ఉంది బీజేపీ. అయితే.. అదే తీరుగా పోలీసులు, బీజేపీ నేతల మధ్య కూడా కోల్డ్‌వార్‌‌ నడుస్తోంది. ఏకంగా పోలీసులను టార్గెట్‌ చేస్తూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మొన్నటి దుబ్బాక ఉప ఎన్నిక నుంచి రాష్ట్రంలో ఈ వాతావరణం నడుస్తోంది. దుబ్బాకలో పోలీసులు క్రియేట్‌ చేసిన సీన్‌తో బీజేపీ నేతల్లో ఫైర్‌‌ మొదలైంది.

Also Read: కెసిఆర్ చర్యలు పారదర్శకంగా ఎందుకులేవు?

దానిని ఎమ్మెల్యే రాజాసింగ్ దాన్ని మరో రేంజ్‌కు తీసుకెళ్లారు. గోవుల అక్రమ రవాణా వెనుక పోలీసులు ఉన్నారని.. అధికార పార్టీ కోసమే పని చేస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్‌కు కోపం వచ్చింది. వెంటనే ఆయన మీడియా ముందుకు వచ్చి బీజేపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతామని హెచ్చరించారు.

సాధారణంగా ఏ రాజకీయ నాయకుడు చేసిన విమర్శలకు పోలీసులు పెద్దగా స్పందించరు. కానీ.. నేరుగా కమిషనరే బీజేపీ నేతలకు హెచ్చరికలు ఇవ్వడంతో .. ఇదే సందు అనుకుని బీజేపీ నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు. ప్రమోషన్ల కోసం కొందరు పోలీసులు.. కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. గో వధపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయడం లేదని.. పోలీసులు చేయలేని పనిని రాజాసింగ్ చేసి చూపిస్తున్నాడని ఆయన తన ఎమ్మెల్యేకు మద్దతుగా మాట్లాడారు.

Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. ఎస్సీ విద్యార్థులకు శుభవార్త..?

దుబ్బాక ఉప ఎన్నికలోనూ అధికార పార్టీ క్యాండిడేట్‌ను గెలిపించాలని నానా కుఠిల ప్రయత్నాలు చేశారని.. అందుకే బీజేపీ అభ్యర్థి అయిన తనను టార్గెట్ చేశారని రఘునందన్‌రావు మాట్లాడారు. తాను గెలిచిన తర్వాత కమిషనర్లకు ఆ విజయాన్ని అంకింతం ఇచ్చినట్లుగా రఘునందన్ రావు సెటైర్ వేశారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ నేతలు డబ్బు, మద్యం పంచుతుంటే పోలీసులు పట్టించుకోలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. కొన్ని పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు కూడా చేశారు. కమిషనర్లపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు.. అది మరింత రసవత్తరంగా సాగుతోంది. మున్ముందు వీరి రాజకీయాలు ఇంకా ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్