https://oktelugu.com/

Jobs: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమాలజీలో జాబ్స్.. నెలకు రూ.70వేల వేతనంతో?

Jobs: ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమాలజీ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. మొత్తం 7 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. సైంటిస్ట్‌-డి, సీనియర్‌ రిసెర్చ్‌ ఫశ్రీలో (ఎస్‌ఆర్‌ఎఫ్‌) ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ సి, కన్సల్టెంట్‌, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌-సి ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. నాన్‌ – మెడికల్‌, డేటా అనలిస్ట్‌ విభాగాలతో పాటు మెడికల్‌ విభాగాలలో ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 13, 2022 / 09:01 PM IST
    Follow us on

    Jobs: ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమాలజీ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. మొత్తం 7 ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. సైంటిస్ట్‌-డి, సీనియర్‌ రిసెర్చ్‌ ఫశ్రీలో (ఎస్‌ఆర్‌ఎఫ్‌) ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ సి, కన్సల్టెంట్‌, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌-సి ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

    నాన్‌ – మెడికల్‌, డేటా అనలిస్ట్‌ విభాగాలతో పాటు మెడికల్‌ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు. పీహెచ్‌డీ, ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ పాస్ కావడంతో పాటు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌ డిగ్రీ పాసైన వాళ్లు కూడా ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. 40 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

    ఈమెయిల్‌ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. nieprojectcell@nienimr.org.in ఐడీకి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 44,450 నుంచి రూ. 70,000 వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతుండటం గమనార్హం.

    2022 సంవత్సరం మార్చి 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.