
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 11 ప్రభుత్వ బ్యాంకులలో 5830 క్లర్క్ పోస్టుల భర్తీ కోసం ఐబీపీఎస్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఏపీలో 263 ఉద్యోగ ఖాళీలు ఉండగా తెలంగాణలో కూడా 263 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగష్టు 1వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
https://www.ibps.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత రాష్ట్ర అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. 2021 సంవత్సరం జులై 1వ తేదీ నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ 100 మార్కుల్కు, మెయిన్ 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక జరగగా ఈ ఉద్యోగ ఖాళీలకు నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ఆగస్టు 28, 29, సెప్టెంబర్ 4 తేదీల్లో ఈ ఉద్యోగ ఖాళీలకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది.