నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో 200 ఉద్యోగాలు..?

ప్రముఖ కంపెనీలలో ఒకటైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 200 ఇంజినీర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇంజనీరింగ్ (బీటెక్‌/బీఈ) పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 50,000 రూపాయల నుంచి 1,60,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. Also Read: నిరుద్యోగులకు పేపాల్ శుభవార్త.. భారీగా ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ..? ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ […]

Written By: Kusuma Aggunna, Updated On : March 6, 2021 3:27 pm
Follow us on

ప్రముఖ కంపెనీలలో ఒకటైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 200 ఇంజినీర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇంజనీరింగ్ (బీటెక్‌/బీఈ) పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 50,000 రూపాయల నుంచి 1,60,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.

Also Read: నిరుద్యోగులకు పేపాల్ శుభవార్త.. భారీగా ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ..?

ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 15 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://www.hindustanpetroleum.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 200 ఉద్యోగాలలో మెకానికల్‌ ఇంజినీర్‌ ఉద్యోగ ఖాళీలు 120 ఉండగా సివిల్ ఇంజనీర్ ఉద్యోగ్ ఖాళీలు 30, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్‌ ఉద్యోగ ఖాళీలు 25, ఎలక్ట్రికల్‌ ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలు 25 ఉన్నాయి.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. బీటెక్ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు..?

ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుంచి ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్‌టాస్క్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 1,180 రూపాయలు కాగా రిజర్వేషన్ల వారీగా ఫీజు మినహాయింపు ఉంటుంది.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

నోటిఫికిషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎక్కువ మొత్తంలో వేతనం లభిస్తున్న నేపథ్యంలో పోటీ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.