HPCL Biofuels Recruitment 2021: హెచ్‌పీసీఎల్ బయోఫ్యూయల్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురును అందించింది. ఉద్యోగ ఖాళీలను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా ఫైనాన్స్, ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేటివ్, మేనేజర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగ ఖాళీలను బట్టి అర్హతకు తగిన ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 16వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. https://www.hpclbiofuels.co.in/ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 2021 సంవత్సరం సెప్టెంబర్ 1 నాటికి 57 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ, డిగ్రీ, ఎంబీఏ, ఎంబీబీఎస్ విభాగాలతో పాటు పది, ఐటీఐ, ఇంజనీరింగ్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను విద్యార్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. https://www.hpclbiofuels.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఏడాదికి పది లక్షల రూపాయల వరకు వేతనం లభించనుంది. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పాట్నా అడ్రస్ కు అభ్యర్థులు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పాలి. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు.