
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 51 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై నెల 3వ తేదీ ఆన్ లైన్ లో దరఖాస్తులకు చివరి తేదీగా ఉంటుంది. రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
https://cdac.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 51 పోస్టుల కోసం బీఈ, బీటెక్, ఎంసీఏలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరగగా ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేకపోయినా మిగిలిన అభ్యర్థులకు మాత్రం 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది. 2021 సంవత్సరం జులై 3వ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుంది. తక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.