Jobs: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 186 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో టెక్నీషియన్, బాయిలర్ టెక్నీషియన్, మెయింటెనెన్స్ టెక్నీషియన్, జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్ స్ట్రక్టర్, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాలలో డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆన్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది.
ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మే 1వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. https://www.hindustanpetroleum.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మరింత బెనిఫిట్ కలగనుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Hindustan petroleum corporation limited invites applications for various posts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com