Group-4 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో కీలక ప్రకటన చేసింది. గ్రూప్-4 స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను మంగళవారం(ఏప్రిల్ 23న) విడుదల చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను సైతం ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఏప్రిల్ 22 నుంచి మే 3వ తేదీ వరకు పరిశీలిస్తామని తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది.
1,599 మంది ఎంపిక..
గ్రూప్-4 రాసిన అభ్యర్థుల్లో స్పోర్ట్స్ కోటాలో 1,569 మందిని టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది. ఈ జాబితాను https://www.tspsc.gov.in/ వెబ్‌సైల్‌లో అందుబాటులో ఉంచింది. వీరంతా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అర్హులని తెలిపింది. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించింది.
హాస్టల్ వార్డెన్ పరీక్ష తేదీలు ఖరారు..
మరోవైపు తెలంగాణ రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో (బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్) ఖాళీల భర్తీకి 2022, డిసెంబరు 22న 581 పోస్టులకు సంబంధించిన టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పరీక్షల తేదీలను కూడా టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మొత్తం 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీతోపాటు ఉపాధ్యాయ విద్య(బీఈడీ/డీఈడీ) పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ పోస్టుల భర్తీకి 2023, జనవరి 6 నుంచి జనవరి 27వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. ఈ వార్డెన్ పోస్టులకు 2024, జూన్ 24 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తాజాగా ప్రకటించింది.