https://oktelugu.com/

Jobs: నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో గ్రూస్‌ సీ జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

Jobs: నార్త్‌ సెంట్రల్‌ రైల్వే (ఎన్‌సీఆర్‌) వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ప్రయాగ్‌ రాజ్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ గ్రూప్ సీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం సిద్ధమైంది. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 21 గ్రూప్ సీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 19, 2021 / 03:26 PM IST
    Follow us on

    Jobs: నార్త్‌ సెంట్రల్‌ రైల్వే (ఎన్‌సీఆర్‌) వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ప్రయాగ్‌ రాజ్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ గ్రూప్ సీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం సిద్ధమైంది. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    మొత్తం 21 గ్రూప్ సీ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, క్రికెట్, జిమ్నాస్టిక్స్, హాకీ, పవర్‌ లిఫ్టింగ్, టెన్నిస్ క్రీడలలో ప్రావీణ్యం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒలింపిక్‌ గేమ్స్‌/వరల్డ్‌ కప్‌/ఏసియన్‌ గేమ్స్‌/చాంపియన్స్‌ ట్రోఫీ/ తత్సమాన స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    2022 సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవఛు. ఎగ్జామినేషన్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

    https://www.rrcpryj.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది. నిరుద్యోగులకు ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.