https://oktelugu.com/

Jobs: బీటెక్ తో పాటు ఎంబీఏ చదివిన వాళ్లకు శుభవార్త.. భారీ వేతనంతో జాబ్స్?

Jobs: బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ ఉద్యోగం మారాలని కోరుకునే వాళ్లకు తీపికబురు అందించింది. ఇంజనీరింగ్ తో పాటు ఎంబీఏ చదివిన వాళ్లకు ప్రయోజనం చేకూరేలా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 8 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వారికి లక్షన్నర రూపాయలు వేతనంగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 10, 2022 / 11:10 AM IST
    Follow us on

    Jobs: బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ ఉద్యోగం మారాలని కోరుకునే వాళ్లకు తీపికబురు అందించింది. ఇంజనీరింగ్ తో పాటు ఎంబీఏ చదివిన వాళ్లకు ప్రయోజనం చేకూరేలా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 8 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

    ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వారికి లక్షన్నర రూపాయలు వేతనంగా లభిస్తుంది. https://www.bis.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం me.hrd@bis.gov.in వెబ్ సైట్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఈమెయిల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపి ఈ ఉద్యోగ ఖాళీల కు దరఖాస్తు చేసుకోవచ్చు.

    45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అనుభవం లేని వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాదు. టీఎన్‌ఎండీ, పీఆర్‌టీడీ విభాగాలతో పాటు ఎన్‌ఐటీఎస్‌, ఎస్‌సీఎండీ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగా అర్హత ఉన్న ఉద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.

    వేర్వేరు విభాగాలలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుండటంతో నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.