https://oktelugu.com/

Job Calendar Telangana: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టిపెట్టాంది. ఉద్యోగ నియామకాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సిన పని లేకుండా కసరత్తు చేస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 10, 2024 3:40 pm
    Job Calendar Telangana

    Job Calendar Telangana

    Follow us on

    Job Calendar Telangana: నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇవీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నినాదాలు. మా నీళ్లు మాకు కావాలి. మా నిధులు మాదగ్గరే ఖర్చు చేయాలని, మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలి అనే నినాదంతో సాగిన తెలంగాణ ఉద్యమానికి యావత్‌ తెలంగాణ మద్దతు తెలిపి ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంది. అయితే నీళ్లు, నిధుల నినాదం నెరవేరింది. నియామకాల విషయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వివక్ష చూపింది. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పినవారే అలా చెప్పలేదని మాట దాటేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారు. దీంతో తెలంగాణ ప్రజలు అలాంటి పాలనకు చరమగీతం పాడారు. 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్‌ తెలిపింది. దీంతో నిరుద్యోగులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు.

    మాట నిలబెట్టుకునేలా..
    తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టిపెట్టాంది. ఉద్యోగ నియామకాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సిన పని లేకుండా కసరత్తు చేస్తోంది. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని రేవంత్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ తరహాలో నిర్ణీత కాలవ్యవధిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని భావిస్తోంది.

    జాబ్‌ క్యాలెండర్‌లో ఇలా..
    ఏటా జనవరి 1న టీఎస్‌పీఎస్సీ, గురుకుల, పోలీసుల, వైద్య నియామక బోర్డులు, సంస్థల ఆధ్వర్యంలో జాబ్‌ క్యాలెండర్లు ప్రకటించాలని భావిస్తోంది. ఆయా బోర్డులు, సంస్థల ఆధ్వర్యంలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రనకటించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఎప్పటికప్పుడు గ్రూప్స్‌ ఉద్యోగాలతోపాటు అన్ని విభాగాల్లో ఉద్యోగాల ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఉద్యోగార్థులు ప్రణాళికాబద్ధంగా ప్రపేర్‌ అయ్యే అవకాశం ఉంటుంది.

    జూన్‌లో టీఎస్‌పీఎస్పీ జాబ్‌ క్యాలెండర్‌..
    ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ప్రామాణిక రాష్ట్రస్థాయి ముసాయిదా జాబ్‌ క్యాలెండర్‌ సిద్ధమవుతోంది. దీనిని త్వరలో ప్రభుత్వానికి పంపించి సర్కార్‌ ఆమోదం తర్వాత జూన్‌లో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఏ నెలలో నోటిఫికేషన్‌ ఇవ్వాలి, పరీక్షలు ఏ నెలలో నిర్వహించాలి, నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది అనే వివరాలు జాబ్‌ క్యాలెండర్‌లో ఉండనున్నాయి. గడువులోగా ప్రక్రియ కూడా పూర్తి చేసేలా స్పష్టమైన విధి విధానాలను రూపొందిస్తోంది. త్వరలో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.