https://oktelugu.com/

Jobs: డిగ్రీ పాసైన అభ్యర్థులకు శుభవార్త.. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు?

Jobs: సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చేంజ్‌ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 120 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రేడ్‌-ఏ (అసిస్టెంట్ మేనేజర్‌) జాబ్స్ ను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ముంబై కేంద్రంగా ఉన్న ఆఫీస్ లో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. 30 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 9, 2022 / 06:38 PM IST
    Follow us on

    Jobs: సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చేంజ్‌ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 120 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రేడ్‌-ఏ (అసిస్టెంట్ మేనేజర్‌) జాబ్స్ ను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ముంబై కేంద్రంగా ఉన్న ఆఫీస్ లో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. 30 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

    2021 సంవత్సరం డిసెంబర్ నెల 31వ తేదీలోపు 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. మొత్తం 120 ఉద్యోగ ఖాళీలలో జనరల్ ఉద్యోగ ఖాళీలు 80 ఉండగా లీగల్ ఉద్యోగ ఖాళీలు 16, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగ ఖాళీలు 14, రీసెర్చ్ ఉద్యోగ ఖాళీలు 7, ఆఫీషీయల్ లాంగ్వేజ్ ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి.

    ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులకు రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. రాతపరీక్షను మూడు దశలలో నిర్వహించి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను చేపడతారు. https://www.sebi.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ చేస్తారు.

    2022 సంవత్సరం జనవరి 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండటంతో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆ తేదీలోపు ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష ద్వారా అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగ ఖాళీలకు తుది ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుంది.