Jobs: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. విశాఖలో భారీ వేతనంతో జాబ్ మేళా?

Jobs: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఈ నెల 4వ తేదీన విశాఖలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు ఈ సంస్థ పేర్కొంది. కొత్త సంవత్సరంలో స్కిల్‌ కనెక్ట్ డ్రైవ్‌ను ఈ సంస్థ నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ జాబ్ మేళాకు మొత్తం 4 కంపెనీలు హాజరు కానుండగా భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుందని బోగట్టా. 19 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు పేటీఎమ్‌లో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ […]

Written By: Kusuma Aggunna, Updated On : January 2, 2022 7:33 pm
Follow us on

Jobs: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఈ నెల 4వ తేదీన విశాఖలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు ఈ సంస్థ పేర్కొంది. కొత్త సంవత్సరంలో స్కిల్‌ కనెక్ట్ డ్రైవ్‌ను ఈ సంస్థ నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ జాబ్ మేళాకు మొత్తం 4 కంపెనీలు హాజరు కానుండగా భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుందని బోగట్టా. 19 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు పేటీఎమ్‌లో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

జయభేరి ఆటోమోటివ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ లో ఐటీఐ మోటార్ మెకానికల్, డిప్లొమా ఇన్ మెకానికల్ చదివిన వాళ్లు అర్హులు. 19 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పత్ర కంపెనీలో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలు ఉండగా ఏదైనా డిగ్రీ & మూడేళ్ల డిప్లొమా చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో సాఫ్ట్ వేర్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలు ఉండగా బీటెక్, ఎంసీఏ, పీజీ, ఎంబీఏ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విశాఖపట్నంలోని పెందుర్తిలో ఈ జాబ్ మేళా జరగనుంది. https://www.apssdc.in/home/jobsbyjobmelaid/1848 వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

ఈ వెబ్ సైట్ ద్వారానే నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించిన సందేహాలను సైతం నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వరుస ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుండగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.