https://oktelugu.com/

Tech Mahindra Jobs: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. టెక్ మహీంద్రాలో జాబ్స్.. మంచి జీతంతో?

Tech Mahindra Jobs: ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీపికబురు అందించింది. ఇప్పటికే పలు జాబ్ మేళాలను నిర్వహించిన ఈ సంస్థ తాజాగా మరో జాబ్ మేళాను నిర్వహించడానికి సిద్ధం కావడం గమనార్హం. చిత్తూరు జిల్లాలో ఈ నెల 18వ తేదీన జాబ్ మేళా జరగనుంది. ప్రముఖ కంపెనీలలో ఒకటైన టెక్ మహీంద్రాలో కస్టమర్ సర్వీస్ ప్రాసెస్ విభాగంలో 100 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్/బీటెక్ చదివిన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 17, 2021 11:34 am
    Follow us on

    Tech Mahindra Jobs: ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీపికబురు అందించింది. ఇప్పటికే పలు జాబ్ మేళాలను నిర్వహించిన ఈ సంస్థ తాజాగా మరో జాబ్ మేళాను నిర్వహించడానికి సిద్ధం కావడం గమనార్హం. చిత్తూరు జిల్లాలో ఈ నెల 18వ తేదీన జాబ్ మేళా జరగనుంది. ప్రముఖ కంపెనీలలో ఒకటైన టెక్ మహీంద్రాలో కస్టమర్ సర్వీస్ ప్రాసెస్ విభాగంలో 100 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

    Tech Mahindra Jobs

    Tech Mahindra Jobs

    గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్/బీటెక్ చదివిన వాళ్లకు మొత్తం 50 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు రూ. 1.8 లక్షల నుంచి రూ. 2.8 లక్షల వరకు సంవత్సరానికి వేతనంగా లభిస్తుంది. హిందీ వచ్చిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు.

    Also Read: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో జాబ్స్.. రూ.50 వేల వేతనంతో?

    ఇంటర్/డిగ్రీ, బీటెక్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండగా ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు 1,64,000 రూపాయల వేతనం, అలవెన్స్ లు లభిస్తాయి. రెజ్యూమే, విద్యార్హతల సర్టిఫికేట్లు, ఆధార్ జిరాక్స్ కాపీలు ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అందించాలి. 9014707897, 7799300659 నంబర్లను సంప్రదించడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    హిమజ డిగ్రీ కాలేజ్‌, కళ్యాణపురం, కేఎన్‌ రోడ్‌, పుత్తురు, చిత్తూరు (జిల్లా)లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.

    Also Read: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో జాబ్స్.. భారీ వేతనంతో?