గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 220 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్, సీనియర్ ఇంజనీర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆగష్టు 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://gailonline.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక ప్రక్రియను చేపడతారు. ఈ ఉద్యోగాలలో వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి.
ఇంజనీరింగ్, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ, సీఎంఏ, గ్రాడ్యుయేషన్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, హెచ్‌ఆర్, లా, మార్కెటింగ్, కెమికల్, మెకానికల్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభిస్తుంది. వెబ్ సైట్ ద్వారా నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వరుసగా రిలీజ్ అవుతున్న జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.