Jobs: ఎగ్జిమ్ బ్యాంక్ లో రాతపరీక్ష లేకుండా భారీగా ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

Jobs: ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఎక్స్ పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. మొత్తం 30 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. 35 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల […]

Written By: Kusuma Aggunna, Updated On : April 11, 2022 4:40 pm
Follow us on

Jobs: ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఎక్స్ పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. మొత్తం 30 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

35 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.eximbankindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 600 రూపాయలుగా ఉండగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది.

2022 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుందని సమాచారం అందుతోంది.

షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. సీఏ, ఎంబీఏ, బీఈ, బీటెక్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.