DRDO Recruitment 2021: భారత రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన డీఆర్డీవో నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (చెస్)లో ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 8 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

రిసెర్చ్ అసోసియేట్ (ఆర్‌ఏ), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎప్) ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్/ ఎంటెక్ /ఎంఈ, పీహెచ్‌డీ పాసైన వాళ్లు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్ లేదా నెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
28 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. ఈమెయిల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు 31,000 రూపాయల నుంచి 54,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. అకడమిక్ ఫలితాలను బట్టి ఉద్యోగ ఖాళీలకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.
ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన తుది ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://www.drdo.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.