https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ లో వేల ఉద్యోగ ఖాళీలు..?

కరోనా విజృంభణ తరువాత దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో నర్సులకు డిమాండ్ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రులు నర్సులను భారీగా నియమించుకుంటున్నాయి. నర్సింగ్ చదివి ఖాళీగా ఉన్న యువతులకు సులభంగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. హైదరాబాద్ లోని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు తెలుస్తోంది. నర్సులుగా అనుభవం లేకపోయినా ఉద్యోగాలు ఇస్తామని కార్పొరేట్ ఆస్పత్రులు ప్రకటనలు […]

Written By: , Updated On : April 5, 2021 / 09:51 AM IST
Follow us on

కరోనా విజృంభణ తరువాత దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో నర్సులకు డిమాండ్ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రులు నర్సులను భారీగా నియమించుకుంటున్నాయి. నర్సింగ్ చదివి ఖాళీగా ఉన్న యువతులకు సులభంగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. హైదరాబాద్ లోని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు తెలుస్తోంది.

నర్సులుగా అనుభవం లేకపోయినా ఉద్యోగాలు ఇస్తామని కార్పొరేట్ ఆస్పత్రులు ప్రకటనలు ఇస్తుండటం గమనార్హం. మరికొన్ని ఆస్పత్రులు ఉద్యోగంతో పాటు వసతి సదుపాయాలను కల్పిస్తున్నాయి. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో ఆస్పత్రులలో వేల సంఖ్యలో రోగులు జాయిన్ అవుతున్నారు. పలు ఆస్పత్రులు రోగులకు వైద్య సేవలను అందించడానికి పడకల సంఖ్యను పెంచుతున్నాయి.

ఉద్యోగాలలో చేరిన సాధారణ నర్సులకు నెలకు 15 వేల రూపాయలు, అనుభవం ఉన్న నర్సులకు గరిష్టంగా 20 వేల రూపాయలు ఇస్తున్నారని సమాచారం. మన దేశంతో పోలిస్తే ఇతర దేశాల్లో నర్సులకు ఎక్కువ మొత్తం వేతనం లభిస్తోంది. ఓవర్ టైమ్ చేస్తే మరింత ఎక్కువ మొత్తం వేతనంగా పొందవచ్చు. ఈ కారణాల వల్ల నర్సులకు డిమాండ్ పెరుగుతోంది. నర్సింగ్ పూర్తి చేసిన యువకులతో పోలిస్తే యువతులకే ఉద్యోగాలు ఎక్కువగా ఉండటం గమనార్హం.

మరోవైపు జీతాలు తక్కువగా ఉండటం వల్ల కోర్సు పూర్తి చేసిన వాళ్లలో చాలామంది ఈ ఉద్యోగాలపై ఆసక్తి చూపడం లేదు. ప్రతి సంవత్సరం గ్రేటర్ పరిధిలో 1500 మంది శిక్షణ తీసుకుంటుండగా వారిలో 800 మంది మాత్రమే వైద్యసేవలు అందించడానికి ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది.