Coal India Recruitment 2021: ప్రముఖ సంస్థలలో ఒకటైన కోల్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాలని భావించే నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 211 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. westerncoal.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం 211 ఉద్యోగ ఖాళీలలో మైనింగ్ సిర్దార్ ఉద్యోగ ఖాళీలు 167 ఉండగా సర్వేయర్ ఉద్యోగ ఖాళీలు 44 పోస్టులు ఉన్నాయి. మైనింగ్ సిర్దార్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 31,852 రూపాయలు వేతనం లభించనుండగా సర్వేయర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 34,391 రూపాయల వేతనం లభించనుంది. ఈ శాలరీ బేసిక్ శాలరీ కాగా రూల్స్ ప్రకారం ఇతర జీతభత్యాలను కూడా పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
సాధారణంగా తీసుకునే బేసిక్ శాలరీతో పోలిస్తే ఈ మొత్తం రెట్టింపుగా ఉండనుంది. మైనింగ్ లేదా మైన్ సర్వేయింగ్ లో డిప్లొమా చేసిన వాళ్లు మైనింగ్ సిర్దార్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, మైనింగ్ సిర్దార్ సర్టిఫికేట్, ఓవర్ మ్యాన్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, ప్రథమ చికిత్స ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి.
18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు రిజర్వేషన్ల ప్రకారం సడలింపులు ఉంటాయి. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ 20వ తేదీ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.