Jobs: కోల్కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. 14 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ మేనేజర్ (సెక్యురిటీ)/ఈ7 గ్రేడ్ ఉద్యోగ ఖాళీలతో పాటు జనరల్ మేనేజర్ (సెక్యురిటీ)/ఈ8 గ్రేడ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 1,00,000 రూపాయల నుంచి 2,15,900 రూపాయల వరకు వేతనంగా లభించనుంది. 2022 సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీ నాటికి 62 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లకు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఆఫ్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సంస్థ కోల్ కతా అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. 2022 సంవత్సరం మార్చి 1వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉండనుంది.
https://www.coalindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Cil recruitment 2022 for 14 manager posts details here
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com