Chittoor Anganwadi Recruitment 2021: చిత్తూరు (Chittoor) జిల్లా మహిళా , శిశు అభివృద్ధి సంస్ధ మహిళా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 20 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 484 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో అంగన్ వాడీ (Anganwadi) కార్యకర్త ఖాళీలు 110 ఉండగా మినీ అంగన్ వాడీ కార్యకర్త ఖాళీలు 65, అంగన్ వాడీ సహాయకురాలు ఉద్యోగ ఖాళీలు 309 ఉన్నాయి.
పదో తరగతి పాసైన మహిళలు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానికంగా నివాసం ఉన్న మహిళలు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 సంవత్సరం జులై 1వ తేదీ నాటికి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న మహిళలు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్ వాడీ కార్యకర్తకు నెలకు 11,500 వేతనం లభిస్తుంది. మినీ అంగన్ వాడీ కార్యకర్తకు నెలకు 7,500 రూపాయల వేతనం లభిస్తుంది.
అంగన్ వాడీ సహాయకురాలు నెలకు 7,000 రూపాయల వేతనం పొందవచ్చు. పదోతరగతి సర్టిఫికెట్ల పరిశీలన, ఓరల్ ఇంటర్వ్యూ, ఇతర వివరాలను పరిశీలించి ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ చేపడతారు. 2021 సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది. https://chittor.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం చిత్తూరుకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. వెబ్ సైట్ ద్వారా అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.