https://oktelugu.com/

Railway Jobs: రైల్వేలో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. ఐటీఐ అర్హతతో?

Railway Jobs: ఇండియ‌న్ రైల్వే నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. ప‌దో త‌ర‌గతి, ఐటీఐ పూర్తి చేసిన వాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 2422 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి అర్హులని చెప్పవచ్చు. ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, మెకానిక్‌ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 21, 2022 / 03:54 PM IST
    Follow us on

    Railway Jobs: ఇండియ‌న్ రైల్వే నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. ప‌దో త‌ర‌గతి, ఐటీఐ పూర్తి చేసిన వాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 2422 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి అర్హులని చెప్పవచ్చు.

    Railway Jobs

    ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, మెకానిక్‌ డీజిల్, టర్నర్, వెల్డర్, షీట్‌ మెటల్‌ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్, పెయింటర్, మెషినిస్ట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం సాధ్యమవుతుంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆన్‌లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: పది అర్హతతో మంచి వేతనంతో జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

    పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం. https://www.rrccr.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభించనుంది.

    ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. నిరుద్యోగులకు మేలు జరిగేలా వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటం గమనార్హం.

    Also Read: ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?