Central Bank Recruitment 2025 : మీరు బ్యాంకు ఉద్యోగాలకు(Bank jobs) ప్రీపేర్ అవుతున్నారా.. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. ఇప్పటికే పలు బ్యాంకులు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశాయి. తాజాగా ముంబైలోని సెట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) రెగ్యులర్ ప్రాతిపదికన క్రెడిట్ ఆఫీసర్(అసిస్టెంట్ మేనేజర్ హోదా) పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 1000 (ఎస్సీ– 150, ఎస్టీ– 75, ఓబీసీ– 270, ఈడబ్ల్యూఎస్– 100, జనరల్– 405) పోస్టులు భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసి ఉంటే చాలు. దరఖాస్తు గడువు ఫిబ్రవరి 20వ తేదీ. ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ తదితర అంశాల ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు…
ఉద్యోగం : క్రెడిట్ ఆఫీసర్
పోస్టులు : 1000
అర్హత: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసి ఉంఆలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ(PWBD) అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
పే స్కేల్: ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 – రూ.85,920 వరకు వేతనం ఇస్తారు.
ఎంపిక విధానం: నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ తదితర అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.750, జీఎస్‌టీ (ఎస్సీ, ఎస్టీ, మహిళలకు, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175, జీఎస్‌టీ) పరీక్ష ఫీజుల చెల్లించాలి.
సిలబస్ ఇదీ :
ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ అంశాల నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎస్‌ఏ పరీక్ష రెండు ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి. పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది.
హెచ్‌ఆర్ ఉద్యోగాలు కూడా..
ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 266 హ్యూమన్ క్యాపిటల్ మేనేజర్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ వచ్చింది. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.