
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 112 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నిరుద్యోగుల నుంచి ఈ సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.cdac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
మొత్తం 112 ఉద్యోగ ఖాళీలలో ప్రాజెక్ట్ మేనేజర్ 13, ప్రాజెక్ట్ ఇంజనీర్(కనీసం ఐదేళ్ల అనుభవం) 28, ప్రాజెక్ట్ ఇంజనీర్(కనీసం రెండేళ్ల అనుభవం), ప్రాజెక్ట్ ఇంజనీర్–మొబైల్ అప్లికేషన్ డెవలపర్(కనీసం రెండేళ్ల అనుభవం) ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవాళ్లు సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, వెబ్ డెవలప్‌మెంట్ తదితర విభాగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
2021 సంవత్సరం మార్చి నెల 31వ తేదీ నాటికి 37 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వూ, స్కిల్ టెస్టు ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుండగా ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.cdac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హత, అనుభవం బట్టి వేతనం లభిస్తుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.